యాషెస్ సిరీస్: ఆసీస్, ఇంగ్లాండ్ తుది జట్లు ఇవే..

Ashes series: Aussies, England finals

0
39

యాషెస్ సిరీస్​లో జోరు మీదుంది ఆస్ట్రేలియా. వరుసగా రెండు టెస్టులు గెలిచి జోష్ లో ఉన్నారు.  మరోవైపు రెండు ఓటములతో నిరాశలో కూరుకుపోయింది ఇంగ్లాండ్ జట్టు. ఇక ఈ రెండు జట్లు ముచ్చటగా మూడో పోరులో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.

మెల్​బోర్న్ వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు వారి తుదిజట్లను ప్రకటించాయి.

ఇంగ్లాండ్ జట్టు

ఇంగ్లాండ్ జట్టులో కీలక మార్పులు చేసింది. ఫామ్​లేమితో సతమతమవుతున్న ఓపెనర్ రోరీ బర్న్స్​తో పాటు ఒల్లీ పోప్​కు మొండిచేయి చూపింది. దీంతో స్టార్ ఓపెనర్ బెయిర్ స్టోతో జట్టులోకి వచ్చాడు. అలాగే స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్​ను తుదిజట్టులోకి తీసుకోలేదు.

హసీబ్ హమీద్, జాక్ క్రాలే, డేవిడ్ మలన్, రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, బెయిర్​స్టో, బట్లర్, మార్క్ వుడ్, ఒల్లీ రాబిన్సన్, జాక్ లీచ్, అండర్సన్

ఆస్ట్రేలియా జట్టు

కరోనా వచ్చిన వ్యక్తికి దగ్గరగా ఉన్న కారణంగా అడిలైడ్ టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే యువ పేసర్ స్కాట్ బోలాండ్​ ఈ మ్యాచ్​తో టెస్టు అరంగేట్రం చేయబోతున్నాడు. జే రిచర్డ్​సన్​, హేజిల్​వుడ్ ఈ మ్యాచ్ కు దూరం కానున్నారు.

వార్నర్, మార్కస్ హారిస్, లబుషేన్, స్మిత్, హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారే, కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథల్ లియోన్, స్కాట్ బోలాండ్.