ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మందిని వేధించే ప్రధాన సమస్య అల్సర్. ఈ సమస్యతో బాధపడుతున్న వారు మందులు, సిరప్ లు వాడి ఉపశమనం పొందుతుంటారు. అలాగే పొట్టలో అల్సర్లు పెరిగి, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్ర సమస్యలతో బాధపడుతున్నప్పుడు పొక్కులు ఏర్పడతాయి. మరి అల్సర్ ను అధిగమించాలంటే ఎలాంటి ఆహరం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
స్ట్రాబెర్రీ. ఇది యాంటీఆక్సిడెంట్లు, అనేక పోషకాల పవర్ హౌస్‌గా పరిగణిస్తుంటారు. ఇందులో సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండవు. ఇది తక్కువ కేలరీల ఆహారం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పొట్టలో అల్సర్లను తొలగించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
పీచుపదార్థాల్లో అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉండే యాపిల్స్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే పొట్టలో అల్సర్‌ల సమస్యను అధిగమించవచ్చు. ఇందుకోసం రోజుకు కనీసం ఒక ఆపిల్ తీసుకోవాలి.
అరటిపండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు ఏ, బీ, సీ, ఈ, జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అల్సర్ల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా, చాలా కాలం పాటు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.