మీరు రోజు అలసిపోనట్టు ఉంటున్నారా? అయితే ఈ లోపమే కారణం కావొచ్చు..

0
108

మనలో చాలామందికి ఏ పని చేయకున్నా కూడా అలసిపోనట్టు ఉండడం, కాళ్లలో తిమ్మిర్లు రావడం, తలలో భారంగా ఉండడం, నరాల సమస్యలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలకు గల కారణం ఏంటో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అనేక చిట్కాలు పాటిస్తూ ఈ సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తుంటారు. అసలు వీటికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మెగ్నీషియం లోపం ఉన్నవారికి ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో మూడువందల జీవరసాయన చర్యలకు మెగ్నీషియం బాధ్యత వహించడంతో సహాయపడుతుంది. నరాలూ కండరాల పనితీరు, పేగులూ ఎముకల ఆరోగ్యం, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణ ఇలా అనేక రకాల చర్యలకు మెగ్నీషియం సహాపడుతుంది.

అంతేకాకుండా  నిద్ర బాగా పట్టేందుకు కూడా మెగ్నీషియం తోడ్పడుతుంది. ఒకవేళ మీకు మెగ్నీషియం నిల్వలు తగ్గినట్టు అనిపిస్తే కకోవా గింజల పొడిని తీసుకోవడం మంచిది. 15-20 రోజులపాటు ఏవైనా పండ్లలో అర టీస్పూన్‌ కకోవా పొడి కలుపుకొని తింటే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంకా బాదంపప్పు వంటి పదార్దాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది.