నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ బిజీ బిజీగా మారారు. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ లేకుండా జీవించలేరు. అయితే వీటి వినియోగమే ఇప్పుడు ముప్పుగా మారుతోంది. అభివృద్ధిని కాసేపు పక్కన పెడితే ఆరోగ్యం మాత్రం చెడిపోతోందని వైద్య నిపుణులు ఆరోపిస్తున్నారు.
ప్రజలు మొబైల్స్ వాడుతున్న తీరు వల్ల అనేక రకాల శారీరక సమస్యలు వస్తున్నాయి. మొబైల్ వాడకం మానసిక సమస్యలనే కాదు చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం నీలి కాంతి నిద్రను ప్రభావితం చేస్తుంది. రెటీనా సమస్యలతో సహా కొత్త వ్యాధిలను తెచ్చిపెడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో మొబైల్ వాడకం చర్మ సమస్యలకు కూడా కారణమవుతుందట.
మీరు మొబైల్‌ని ఎక్కువగా వాడుతున్నట్లయితే కళ్ళు చుట్టూ ఉన్న చర్మాన్ని మనం క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి. దీని కోసం మీరు కంటి క్రీమ్ ఉపయోగించడం అవసరం.
మొబైల్ ఫోన్ల వినియోగంతో చర్మంపై రేడియేషన్ ప్రభావం ఎక్కువగా పడుతోంది. అయితే, మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం ఎక్కువసేపు కాల్స్ మాట్లాడటం వల్ల చర్మ సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మొబైల్ వాడక ప్రభావం మీ జుట్టు, చర్మంపై కూడా ఉంటుంది. వెంట్రుకల నుండి వచ్చే సెబమ్ ఫేషియల్ ఆయిల్‌ని పెంచుతుంది. ఇది బ్లాక్‌హెడ్స్ , మొటిమలకు కూడా దారి తీస్తుంది. జిడ్డు లేదా మొటిమల బారిన పడే చర్మం కోసం ఆస్ట్రింజెంట్ లోషన్, కాటన్‌తో తుడవడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు తగ్గుతుంది.