బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల..వైద్యులు ఏమన్నారంటే..

0
81

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కోల్‌కతాలోని వుడ్‌లాండ్‌ ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని పేర్కొంది. ఎలాంటి జ్వరం లేదని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాత్రంతా నిద్రపోయారని, భోజనం కూడా తీసుకుంటున్నట్లు తెలిపింది.