గంజి తాగడం వల్ల అవన్నీ పుష్కలంగా లభిస్తాయి.. అందం కూడా మీ సొంతం

-

Rice starch Ganji: పూర్వం అన్నం వండి గంజి కాచేవారు. ఆ గంజిని తాగే వారు. అందుకేనేమో మన తాతలు, ముత్తాతలు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనవి ఎలక్ట్రిక్ కుక్కర్లలో వండే రోజులు గంజి అంటే నేటి పిల్లలకు కనీసం తెలియదు కూడా. కానీ గంజి వల్ల ఎంత ఆరోగ్యమో తెలిస్తే… మళ్లీ పాత రోజుల్లో వండినట్టు అన్నం వండడం మొదలుపెడతారు.

- Advertisement -

గంజిని అన్నంలో వేసుకుని, చిటికెడు ఉప్పు వేసుకుని తింటే రుచిగా ఉండడమే కాదు, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. జ్వరం ఉన్నప్పుడు తాగితే త్వరగా తగ్గేలా చేస్తుంది. చర్మాన్ని సున్నితంగా, అందంగా మార్చుతుంది. చర్మ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని వదిలిస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు గంజిని తాగితే ఇన్ స్టంట్ ఎనర్జీ వస్తుంది. గంజి(Rice starch Ganji)తో బి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. పసి పిల్లలకు, ఎదిగే పిల్లలకు రోజూ గంజిని తాగిస్తే చాలా మంచిది. వారికి సరైన పోషకాలు అందుతాయి. శారీరక ఎదుగుదల కూడా బావుంటుంది. పిల్లలు విరేచనాలు, వాంతులతో బాధపడుతున్నప్పుడు గంజిని మించిన దివ్యౌషధం లేదు. కనుక ఇంట్లో కుక్కర్ అన్నం వండడానికి బదులు గంజి వార్చేలా అన్నం వండితే చాలా మంచిది. గంజిని ఇంటిల్లిపాది తాగితే ఆరోగ్యం మీ సొంతం.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...