ప‌ర‌గ‌డుపున గోరువెచ్చ‌ని నీళ్లు తాగడం వల్ల లాభాలివే..

0
117

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం సీజ‌న్ న‌డుస్తోంది. ఈ సీజ‌న్ లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్న అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు చాలా మందిని వేధిస్తుంటాయి. ఈ సమస్యలకు బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు కార‌ణంగా వ‌స్తాయి. దీంతోపాటు దోమ కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ, మ‌లేరియా వంటి వ్యాధులు వ‌స్తాయి. అలాగే క‌లుషిత ఆహారం, నీరు తీసుకుంటే టైఫాయిడ్ వ‌స్తుంది.

అందుకే ఈ సీజ‌న్ లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అయితే ఈ వ్యాధులు మనదరికి చేరకుండా ఉండడానికి..అలాగే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు వేడి నీళ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అందుకే రోజు ఉదయాన్నే  2 లేదా 3 గ్లాసుల మోతాదులో వేడి నీళ్లు తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. పేగుల్లో ఉండే వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు వ‌స్తాయి. దీంతో అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది. అలాగే కిడ్నీలు కూడా శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ కూడా త‌గ్గుతుంది.

‘నీరు ఎక్కువగా తాగండి..అనారోగ్యాలను తరిమి కొట్టండి’