పీఎం కిసాన్ లిస్ట్ లో మీ పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి..

0
33
Pm Kisan samman

ఇప్పటికే మోడీ సర్కార్ ఎన్నో పథకాలను రైతుల కోసం తీసుకొచ్చారు. వీటిలో ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న పథకం మీద ఆధారపడి నివసించే ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏటా 6000 నగదు అందుతుంది.

అయితే ఇప్పటివరకు పదకొండు విడతలుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసింది.విడతల వారిగా రూ. 2000 అందిస్తుంది. అర్హులైన రైతులకు జూలై 31న రాబోయే 12వ విడతలో రూ.2000 సాయం అందుకోవచ్చని భావిస్తున్నారు. పీఎం కిసాన్‌ లబ్దిదారుల జాబితాలో అర్హులైన ఎవరైనా పేరు లేకుండా ఈ ప్రయోజనాన్ని కోల్పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని మార్గాల ద్వారా పరిహారం పొందవచ్చు.

మీరు పీఎం కిసాన్‌ పథకానికి అర్హులై ఉండి జాబితాలో పేరు లేకుండా మీ పేరును కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చు. ఇందు కోసం కేంద్రం కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందు కోసం రైతులు వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్‌ కోసం అన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్‌, బ్యాంకు అకౌంట్‌, పట్టాపాస్‌ బుక్‌ వివరాలు నమోదు చేసుకుని ఈ ప్రయోజనం పొందవచ్చు.

లేకుంటే ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 155261కు డయల్‌ చేయడం ద్వారా కూడా మళ్లీ మీ పేరును నమోదు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా మీ పేరును నమోదు చేసుకోవడానికి అవసరమైన అధికారులను ఇతర హెల్ఫ్లైన్‌ నంబర్‌ 011-24300606లో కూడా సంప్రదించవచ్చు. ఫోన్‌ నంబర్లు పని చేయకపోతే లబ్దిదారుల జాబితాలో పేర్లు లేని రైతు కుటుంబాన్ని తమ జిల్లాలోని జిల్లా స్థాయి ఫిర్యాదుల పరిష్కార మానిటరింగ్‌ కమిటీని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు. మీ పేరును రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత జాబితాలో లబ్దిదారుని స్థితిని తనిఖీ చేసుకోవచ్చు.

ఎలా తెలుసుకోవాలి..?

PM Kisan అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

హోమ్‌ పేజీలో ఉన్న ఫార్మర్స్‌కార్నర్‌ కేటగిరిలోకి వెళ్లండి

ఈ విభాగంలో బెనిఫిషియరీ స్టేటస్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయండి

ఆధార్‌ నంబర్‌, పీఎం కిసాన్‌ ఖాతా నంబర్‌ లేదా మీ రిజిస్ట్రేషన్‌ మొబైల్‌ నంబర్‌ వివరాలు నమోదు చేయాలి

తర్వాత గెట్‌ డేటా ఎంపికపై క్లిక్‌ చేసి మీ పేరు స్థితిని తెలుసుకోవచ్చు