కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? అయితే ఈ పదార్ధాలు అస్సలు తినకూడదు

0
105
3D Illustration von menschlichen Nieren mit Querschnitt

ప్రస్తుతం ఎక్కువ మందిని వేధించే సమస్యల్లో ఒకటి కిడ్నీలో రాళ్లు. దీని కారణంగా చాలా మంది నానా తంటాలు పడుతుంటారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ..జేబు ఖాళీ చేసుకుంటారు. ఇంతకుముందు కేవ‌లం పెద్ద వ‌య‌స్సులో ఉన్న‌వారికి మాత్ర‌మే ఈ స్టోన్స్ వ‌చ్చేవి.

కానీ ఇప్పుడు వ‌య‌స్సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌స్సుల వారికి కూడా కిడ్నీ స్టోన్స్ స‌మ‌స్య వ‌స్తోంది. దీంతో క‌డుపు నొప్పి, త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌న చేయాల్సి రావ‌డం, వికారం, వాంతులు కావ‌డం, బ‌ల‌హీనంగా ఉండ‌డం, నీర‌సంగా అనిపించ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఇలా వ‌స్తే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయ‌ని భావించాలి. అయితే కిడ్నీ స్టోన్స్ స‌మ‌స్య ఉన్న‌వారు నీళ్ల‌ను బాగా తాగ‌డంతో పాటు డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవాలి.

కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు జంక్ ఫుడ్‌ను మానేయాలి. ముఖ్యంగా చైనీస్‌, మెక్సిక‌న్ ఫుడ్స్ ను తిన‌కూడదు. ఎందుకంటే వీటిల్లో ఉప్పును అధికంగా వాడుతారు. ఇది కిడ్నీల‌కు కీడు చేస్తుంది. క‌నుక ఈ ఫుడ్స్‌ను తిన‌కూడ‌దు. అలాగే మాంసాహారాన్ని కూడా త‌గ్గించాలి. మాంసాహారంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. శ‌రీరంలో ప్రోటీన్లు అధికంగా చేరితే అవి కిడ్నీల‌పై ప్రభావాన్ని చూపిస్తాయి.

క‌నుక కిడ్నీ స్టోన్స్ ఉన్న‌వారు మాంసాహారాన్ని త‌క్కువ‌గా తీసుకోవాలి. అలాగే ప‌ప్పు దినుసుల్లోనూ ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక‌.. వీటిని కూడా త‌క్కువ మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కిడ్నీ స్టోన్స్ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌వుతుంది. అలాగే పాల‌కూర‌, తృణ ధాన్యాలు, ట‌మాటాల్లోనూ ఆగ్జ‌లేట్స్ అధికంగా ఉంటాయి. కాబ‌ట్టి వీటిని కూడా తిన‌రాదు. ఇలా ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల కిడ్నీ స్టోన్స్‌ను తొల‌గించుకోవ‌చ్చు.