ఆఫీస్ ల్యాప్ టాప్ లో ఈ పని అస్సలు చేయకండి..అలా చేస్తే మీ జాబ్ కే ఎసరు!

0
35

కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటు పడ్డారు ఉద్యోగులు. దీనితో ఆయా కంపెనీలు ఉద్యోగులకు ల్యాప్ టాప్ లు అందించారు. తద్వారా ఉద్యోగులు తమ పనిని ఇంటి నుంచే చేసేస్తున్నారు. అయితే, చాలా మంది వ్యక్తులు తమ వ్యక్తిగత పనిని సైతం ఆఫీసు ల్యాప్‌టాప్‌లో చేస్తున్నారు. అలా చేయడం పెద్ద పొరపాటు అనే చెప్పాలి. ఆఫీస్ ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మంది ఉద్యోగులు ఒక కంపెనీలో పని చేస్తూ మరో కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే అలా చేయడం మీ జాబ్ కే ఎసరు పెడుతుంది. కొన్ని సందర్భాల్లో మీ కార్యాలయంలోని IT బృందం మీ పనిని గమనిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మీకు ఇబ్బందులు తప్పవు.

అలాగే కొంతమంది తమ వ్యక్తిగత డేటాను, ఫైల్స్‌ను తమ పని సమయంలో ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో సేవ్ చేసుకుంటుంటారు. అయితే, అలా అస్సలు చేయకూడదు. దీని కారణంగా మీ వ్యక్తిగత విషయాలు లీక్ అయ్యే ప్రమాదం ఉంది.

చాలా సార్లు ఉద్యోగులు తమ షిఫ్ట్ సమయంలో లేదా ఖాళీ సమయంలో ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో Googleలో అభ్యంతరకరమైన కంటెంట్‌ను వెతుకుతారు. అదే సమయంలో, కొంతమంది ఆఫీసు ల్యాప్‌టాప్‌లలో పోర్న్ చూస్తుంటారు. ఇలాంటి పనులు ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో ఏమాత్రం చేయకూడదు. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది.