ఉడికించిన వేరు శెనగలు తినడం వల్ల కలిగే లాభాలివే..

0
112

వేరు శనగపప్పు ఇష్టపడని వారు ఎవరుంటారు చేప్పండి. వీటిని కొంతమంది పచ్చివి తినడానికి ఇష్టపడితే మరికొందరు వేయించినవి లేదా ఉడికించినవి ఇష్టపడతారు. ఇవి ఎలా తిన్న సరే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. పల్లీల్లో విటమిన్ ఇ, మెగ్నీషియం,మోనోశాచురేటెడ్‌ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

శరీరానికి మేలుచేసే  విటమిన్‌ ఇ, b1, b6, ప్రోటీన్‌, మాంగనీసు,అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా వేరు శనగపప్పులో అధికంగా ఉంటాయి. పల్లీల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యంగా ఉంటాయి. పల్లీల్లో ఉండే రెస్‌వెట్రాల్‌ అనే పాలిఫినాలిక్‌ యాంటీ ఆక్సిడెంటుకు క్యాన్సర్లు రాకుండా మన శరీరానికి రక్షణ కల్పిస్తుంది.

ముఖ్యంగా ప్రస్తుతం ఎదిగే పిల్లలకు ఇది మంచి ఆహారం అని నిపుణులు చెబుతున్నారు. తరుచుగా గుప్పెడు పల్లీలు పిల్లలకి స్నాక్ లా ఇస్తూ వుంటే వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. అంతేకాకుండా పిల్లలకు మెదడు సక్రమంగా పనిచేయడానికి,  జ్ఞాపకశక్తి కూడా పెరగడానికి వేరు శనగపప్పు తోడ్పడుతుంది.

 

రోజుకో గుప్పెడు పల్లీలు వుండికించి తినండి..ఆరోగ్యంగా ఉండండి..