Spinach :పాలకూరతో ఆ రెండు రకాల క్యాన్సర్లకు చెక్!!

-

Spinach:టేస్టీ ఫుడ్ కోసం వెంపర్లాడుతూ పోషకాహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు నేటి జనరేషన్. ఆకుకూరలంటేనే ఆమడ దూరం పరిగెత్తుతున్నారు. కానీ మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఆకు కూరల్లో అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి. అందుకే మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఆకు కూరలను తప్పనిసరిగా చేర్చాలి. ముఖ్యంగా పాలకూరను తరచూ తినాలి. అందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తాయి. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి యాంటీ ఏజెంట్లుగా పనిచేస్తాయి. పాలకూర (Spinach)లో లభించే సి, ఏ విటమిన్స్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్స్ క్యాన్సర్‌‌ని నివారించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ను అదుపు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. ఎలాగైనా సరే ఆహారంలో పాలకూర ను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...