Reduce Bad Cholesterol | కొవ్వు కోవాలా కరగాలా.. ఇవి తినేయండి..

-

మన శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఎవరి గుండెను వాళ్లు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే వాళ్లు అంత ఆరోగ్యంగా ఉంటారు. మన శరీరంలో జరిగే చిన్నచిన్న మార్పులు కూడా గుండెపై ప్రభావం చూపుతాయి. అందులోనూ కొవ్వు పెరిగిందంటే దాని ప్రభావం గుండెపై మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే కొవ్వు పెరగకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉంటే దానిని వీలైనంతగా తగ్గించుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు. కొవ్వును ఎంత కంట్రోల్‌లో ఉంచుకుంటే మన ఆరోగ్యం అంతబాగుంటుందని వైద్యులు చెప్తున్న మాట. అయితే శరీరంలోని చెడు కొవ్వును(Reduce Bad Cholesterol) కోవాలా కరిగించేయాలంటే మన ఆహారంలో కొన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు నిపుణులు. మన ఆహారం మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుందని, మన ఆహారంలో మనం చేసుకునే చిన్నచిన్న మార్పులు కూడా ఆరోగ్యంపై మంచి ప్రభావాన్నే చూపుతుందని అంటున్నారు. అది మంచైనా చెడైనా ప్రభావం బాగానే ఉంటుందని అంటున్నారు. మరి కొవ్వును తగ్గించుకోవడానికి మన ఆహారంలో చేసుకోవాల్సిన మార్పులేంటో ఒకసారి చూసేద్దామా..

- Advertisement -

ఒమేగా-3 ఫ్యాటీ: శరీరంలో కొవ్వు శాతాన్ని కరిగించడం కోసం ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్(Omega 3 Fatty Acids) అధికంగా ఉండే ఆహారం చేపలు, అవిసెలు, వాల్‌నట్స్ వంటి ఆహారం తీసుకోవాలి. ఇవి శరీరంలో మంటను తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి వీటిని మన డైలీ డైట్‌లో ఉండేలా చూసుకుంటే కొవ్వు పట్టడాన్ని నివారించొచ్చని అంటున్నారు నిపుణులు.

ప్రొటీన్: శరీరానికి ప్రొటీన్ ఎంతో మేలు చేస్తుంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం కూడా చాలా మంచిది. కాబట్టి ప్రొటీన్ అధికంగా ఉండే బీన్స్, చిక్కుళ్ళు, టోఫు వంటివి తీసుకోవడం చాలా మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్న మాట. ప్రొటీన్ కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అందులోనూ ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ తీసుకోవడం ఇంకా మేలు చేస్తుంది. దీంతో పాటుగా సంతృప్త కొవ్వుల(జంక్ ఫుడ్)ను తీసుకోవడం తగ్గించాలి. వాటి స్థానంలో అవకాడో, నట్స్, ఆలివ్ ఆయిల్ వినియోగించిన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫైబర్: ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేయదు. తద్వారా నోరు రుచులు కోరడం తగ్గి శరీరంలో చెడు కొవ్వు పెరగడం తగ్గుతుంది. అంతేకాకుండా ఫైబర్ అధికంగా తీసుకోవడం శరీరంలోని చెడు కొవ్వును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని కోసం ఓట్స్, బార్సీ, పండ్లు, ఫైబర్ రిచ్ కూరగాయలు తరచుగా తీసుకోవాలి. అంతేకాకుండా ఫైబర్ అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు కూడా నయమవుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యానికి చాలా మంచివని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

వ్యాయామం: ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ వర్కౌట్ చేయాలి. వారానికి 150 నిమిషాల ఇంపాక్ట్ వర్కౌట్ చేయాలి, అది చెడు కొవ్వును కోవాలా కరిగించేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకుని గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే వ్యాయామం చాలా ముఖ్యమని వైద్యులు చెప్తున్నారు.

బరువు: మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మన బరువును కూడా మెయింటెన్ చేయడం చాలా ముఖ్యమని నిపుణులు వివరిస్తున్నారు. దాంతో పాటుగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి.. వర్కౌట్స్ చేయాలి. మంచి లైఫ్‌స్టైల్ ఫాలో అయితే బరువుని కంట్రోల్‌లో ఉంచుకోవడంతో పాటు గుండెను ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చు. మన ఎత్తుని బట్టి బరువును మెయింటెన్ చేయాలని నిపుణులు చెప్తున్నమాట. వీటన్నింటిని మెయింటెన్ చేయడం ద్వారా శరీరంలో ఉండే చెడు కొవ్వును తగ్గించుకోవచ్చని(Reduce Bad Cholesterol), హెల్తీ లైఫ్‌ను గడపొచ్చని నిపుణులు వివరిస్తున్నారు.

Read Also: బెల్లీ ఫ్యాట్ భలే డ్రింక్స్.. వీటిని ట్రై చేయండి..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...