Breaking: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. కొత్తగా ఒమిక్రాన్ బీఏ 5 కేసు నమోదు

0
102

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. అయితే ప్రస్తుతం కరోనా విజృంభణ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది అని ప్రజలందరూ అనుకుంటున్న క్రమంలో కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన బీఏ పేరుతో మళ్ళి జనాలపై విరుచుకుపడుతుంది. అయితే ఈ వేరియంట్ కు చెందిన 4 కేసులు ఇప్పటికే నమోదుకాగా..ప్రస్తుతం మరో వ్యక్తికి బీఏ 5 వేరియంట్ పాజిటివ్ గా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యక్తిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందించడంతో పాటు..పరిసర ప్రాంతాల్లో స్థానికులను కూడా పరీక్షిస్తున్నారు. కావున అందరు కరోనా నిబంధనలను పాటించడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.