బ్లూ టీ తెలుసా? ఇది ఏ పూలతో తయారు చేస్తారో తెలుసా? దీని లాభాలు ఇవే

బ్లూ టీ తెలుసా? ఇది ఏ పూలతో తయారు చేస్తారో తెలుసా? దీని లాభాలు ఇవే

0
44

తేనీరులో అనేక రకాలు ఉంటాయి. అదే మనం తాగే టీ, అయితే చాలా వరకూ ఉదయం టీ డికార్షన్ చేసుకుని పాలల్లో వేసుకుని అలా పంచదారతో టీ తాగితే కాని మన రోజువారి బండి నడవదు కొందరికి. అయితే చాలా మంది పాలువేసుకుంటే మరికొందరు కేవలం వాటర్ డికార్షన్ మాత్రమే తాగుతారు, ఇక లెమన్ టీ, గ్రీన్ టీ, ఆరెంజ్ టీ, గ్రాస్ టీ ఇలా అనేక రకాల కొత్త టీలు మార్కెట్లో అమ్ముతున్నారు.

పెద్ద పెద్ద టీ అవుట్ లెట్స్ లో ఈ ప్లేవర్స్ దొరుకుతున్నాయి, ఇన్ స్టంట్ పౌడర్స్ వచ్చాయి, కాని చాలా మంది ఆరోగ్యం కూడా కావాలి అని టీలో అలాంటి బెస్ట్ టీ ఏమైనా ఉందా అని కూడా చూస్తారు.

ఈ కరోనా సమయంలో బ్లూ టీ గురించి చర్చకు వచ్చింది. ఎప్పటి నుంచి ఈ టీ అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది ఈ టీపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు జింజర్ టీతో పాటు చాలా మంది ఉద్యోగులు వ్యాపారులు బ్లూ టీ తాగుతున్నారట, ఎందుకు అంటే బ్లూ టీ లో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇక వయసు కూడా ఉన్నట్లు కనపించరు, నిత్య యవ్వనంగా కనిపిస్తారు.
అంతేకాదు ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది.. బ్లూ టీలో యాంటీ గ్లైసటిన్ అధికంగా ఉంటుంది. కాబట్టి చర్మం కాంతివంతంగా, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.. శంఖం పువ్వులతో ఈ టీని తయారు చేస్తారు. అయితే చాలా ప్లేవర్స్ మార్కెట్లో ఉన్నాయి అంటున్నారు నిపుణులు.