భోజనం చేసే సమయంలో ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి ఎంతో పాపం

భోజనం చేసే సమయంలో ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి ఎంతో పాపం

0
44

చాలా మంది భోజనం చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించరు.. దీని వల్ల వారి ఇంటిలో అనేక ఆర్దిక సమస్యలు చిక్కులు వస్తాయి అంటున్నారు పండితులు.. దరిద్రం తాండవం చేయడం వల్ల పలు సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు, అయితే ముఖ్యంగా ఇంటిలో భోజనం చేసే సమయంలో చాలా నియమాలు ఉంటాయి..

అవి పాటిస్తే ఆ ఇంట కనక వర్షం కురుస్తుంది.. డబ్బుకి సిరిసంపదలకు లోటు ఉండదు అని చెబుతున్నారు. మరి ఎలా భోజనం చేయాలి ఎలా చేయకూడదు అనేది చూద్దాం. అన్నం అన్నపూర్ణాదేవి అందుకే ఆమెకి మనం ఆగ్రహం తెప్పించకూడదు. అందుకే కాలితో అన్నం ఎప్పుడూ తన్నకూడదు అన్నంపై ఉమ్మివేయకూడదు, ఏ సమయంలో భోజనం చేసినా కాళ్లు చేతులు కడుక్కుని చేయాలి.

కూర్చొని భోజనం చేస్తే భోజనం పూర్తి అయ్యేవరకూ అసలు పీటపై నుంచి లేవకూడదు, అలాగే అన్నం తినే సమయంలో అటు ఇటు తిరగకూడదు..తినే సమయంలో అన్నం మెతుకులు కింద పడితే వెంటనే వాటిని తీసేయాలి..మనం భోజనం చేసిన తర్వాత చేతులు కంచంలో కడగకూడదు.భోజనం చేసిన తర్వాత మనం తిన్న ఆకుని మన భార్య కాని తల్లి కాని తీస్తే ఎంతో పుణ్యం వారికి.