తెలంగాణలో రేపటి నుంచి బూస్టర్ డోస్ ప్రారంభం..వారికి మాత్రమే

Booster dose starts from tomorrow in Telangana..for them only

0
82

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.  టీకా తీసుకున్న వారికి కరోనా రావడం గమనార్హం. చాలా రోజుల తర్వాత తెలంగాణలో రోజు వారీ కేసులు 2 వేల మార్కును దాటాయి. రెండు డోసుల టీకా వేసుకున్న వారికి పాజిటివ్ రావడం గమనార్హం.

తెలంగాణాలో రేపటి నుంచి బూస్టర్​ డోసు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. హెల్త్​కేర్ వర్కర్లు, ఫ్రంట్​లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్​ డోసు ఇవ్వనున్నారు. వారు బూస్టర్​ డోసు కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సిన అవసరం లేకుండా గతంలో ఉన్న రిజిస్ట్రేషన్​తోనే బూస్టర్​ డోసు ఇవ్వనున్నారు. అందుకోసం కొవిన్​లో స్లాట్​ బుకింగ్​ ద్వారా నేరుగా టీకా కేంద్రానికి వెళ్లే వెసులుబాటును కల్పించారు.

అలాగే కొవిడ్​ వ్యాక్సిన్​ రెండో డోసు వేసుకుని 9 నెలలు పూర్తైన వారికి, 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8.3 లక్షల మంది 60 ఏళ్లు పైబడి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది.