బంగార్రాజు మామూలోడు కాదు..ఏకంగా 8 మంది హీరోయిన్లతో..

0
46

ఈసారి సంక్రాంతికి ‘బంగార్రాజు’ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రమోషన్స్​ ఫుల్​గా జరుగుతున్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు సీక్వెల్​గా తీసిన ఈ సినిమాలో ఓ విషయం తెగ ఆసక్తి కలిగిస్తోంది.

2016 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’.. అద్భుతమైన విజయం సాధించింది. ఈ కుటుంబ కథా పల్లెటూరి చిత్రం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అందులో నాగ్​ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా చేశారు. స్పెషల్ సాంగ్​లో అనసూయ, హంస నందిని లాంటి బ్యూటీస్ అదరగొట్టేశారు.

మరి ఈ సినిమా సీక్వెల్​ ‘బంగార్రాజు’లో అంతకంటే ఎక్కువమందే ఉన్నారు. తొలిపార్ట్​లో కనిపించిన రమ్యకృష్ణతో ఈసారి కొత్తగా కృతిశెట్టి హీరోయిన్​గా చేసింది. ఇందులో నాగచైతన్య సరసన ఆమె కనిపించనుంది. స్పెషల్​ సాంగ్​లో ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా.. నాగ్-చైతూతో కలిసి డ్యాన్స్​ చేసింది. వీళ్లే కాకుండా మీనాక్షి దీక్షిత్, దర్శనా బనిక్, వేదిక, దక్ష నగర్కర్, సిమ్రత్ కౌర్​ కూడా అతిథి పాత్రల్లో మెరిసి సందడి చేయనున్నారు. హీరోయిన్లు కాకుండా మరో ఆరుగులు ముదుగుమ్ములు ఈ సినిమాలో తమ అందచందాలతో అదరగొట్టనున్నారు.