ఆ టైమ్ లో తినకపోతే బరువు పెరిగిపోతారు

ఆ టైమ్ లో తినకపోతే బరువు పెరిగిపోతారు

0
166

ప్రతి రోజు మనం తినే ఆహారంలో అత్యంత కీలక పాత్ర పోషించేది ఉదయం తీసుకునే ‘బ్రేక్‌ఫాస్టే’! రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే మంచి పోషక విలువలున్న అల్పాహారం తీసుకోవడమూ ముఖ్యమే. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమందికి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికే టైముండదు. మరికొంతమందైతే ఏదో ఒకటి తినేద్దాంలే అని సరిపెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదమూ లేకపోలేదు. అలాగే మనం చేసే పనిపై సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోవచ్చు! ఇంతకీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి? చేయకపోతే వచ్చే నష్టాలేంటి? తెలుసుకుందాం !

పీచు పదార్థాలు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండే పోషక విలువలున్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాగే ఉదయాన్నే సమతుల అల్పాహారం తీసుకోవడం వల్ల ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మనం ఏ పని మీదైనా పూర్తి శ్రద్ధ పెట్టొచ్చు. అదే బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఉంటే ఆకలి వేసి, చేసే పనిపై దృష్టి పెట్టలేకపోతాం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ బరువును అదుపులో పెట్టుకోవాలంటే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందుతాయి. శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోతే మధ్యాహ్నం భోజనం మోతాదుకు మించి తీసుకుంటాం.. దీంతో బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఒక వేళా మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే

బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. మెదడుకు మనం తీసుకునే ఆహారం నుంచి గ్లూకోజ్ అందాలి. అలాకాకుండా అల్పాహారం మానేస్తే మెదడు చురుగ్గా పని చేయదు. ఫలితంగా చేసే పని పట్ల ఆసక్తి తగ్గుతుంది. క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోకపోతే మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం.. లాంటి పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఫలితంగా ఇవన్నీ గుండెపోటు రావడానికి కారణాలవుతాయి. అల్పాహారం తీసుకోని మహిళల్లో నెలసరి సరిగ్గా రాకపోవడం లాంటి సమస్యలు కూడా ఎదురువుతాయి.