బ్రేకింగ్ — చికెన్ తింటున్నారా ? చ‌చ్చిన కోడిక క‌రోనా పాజిటీవ్

బ్రేకింగ్ -- చికెన్ తింటున్నారా ? చ‌చ్చిన కోడిక క‌రోనా పాజిటీవ్

0
149

ఈ క‌రోనా వైర‌స్ విజృంభించిన స‌మ‌యంలో చాలా మంది చికెన తిన‌డం కూడా మానేశారు, త‌ర్వాత ప్ర‌భుత్వాలు చికెన్ వ‌ల్ల క‌రోనా రాదు అని చెప్ప‌డంతో మ‌ళ్లీ చికెన్ తిన‌డం స్టార్ట్ చేశారు, అయితే ఇప్పుడు మళ్లీ కోడి కూర ఇష్టంగా తినేవారికి ఓ చేదు వార్త.

చచ్చిపోయిన కోడి రెక్కల ముక్కలకు కరోనా టెస్టులు చేయగా దానికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఇది తాజాగా చైనాలోని షెంజాన్ లో ప‌రీక్ష‌ల్లో తేలింది. దీంతో ప్ర‌పంచం మ‌ళ్లీ దీనిపై ఆందోళ‌న చెందుతోంది.

ఈ చికెన్ పీస్‌లు బ్రెజిల్ నుంచి దిగుమతి అయ్యాయని చెబుతున్నారు. చచ్చిన కోడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిసిన తర్వాత స్థానికులు ఆందోళన చెందారు.. ఈ చికెన్‌ను పట్టుకున్న వారికి కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక ప్రాసెస్ ఫుడ్ కొనే స‌మ‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అని చెప్పింది చైనా ప్ర‌భుత్వం.