సి విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా ఇది తప్పక తెలుసుకోండి

సి విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా ఇది తప్పక తెలుసుకోండి

0
34

ఈ కరోనా సమయంలో చాలా మంది విటమిన్ సి ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడుతున్నారు.. అయితే ఈ మందులు గతంలో 14 రూపాయలు ఉంటే ఇప్పుడు 60 నుంచి 70 రూపాయలకు పెరిగింది, డిమాండ్ పెరిగింది అందుకే స్టాక్ ఎక్కడా దొరకడం లేదు.

దీంతో చాలా మంది కొన్ని వందల ట్యాబ్లెట్స్ కొనేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు, అయితే ఇలా ఈ మందులు కొనుక్కునే వారు కాస్త ఆలోచించాలి, ఎంతైనా ఈ కరోనా సమయంలో చాలా మంది వీటి కోసం చూస్తున్నారు అలాంటి వారికి ఇవి దొరకడం లేదు కేవలం 20 లేదా 10 మాత్రమే పెట్టుకోండి అని చెబుతున్నారు.

అందరూ తప్పక తెలుసుకోండి, వీలైనంత వరకు విటమిన్లను ఆహార రూపంలో తీసుకోవడానికి ప్రయత్నించాలి. అత్యవసరమైతే తప్ప టాబ్లెట్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని అంటున్నారు వైద్యులు. ఇక రోజు నిమ్మకాయ బత్తాయి నారింజ కమలా ఇలాంటి పళ్లు తీసుకుంటే చాలని సీ విట మిన్ పుష్కలంగా వస్తుంది అంటున్నారు వైద్యులు.