మనలో చాలా మంది పెరుగు ఇష్టంగా తింటారు. ఇక పెళ్లిళ్లు ఫంక్షన్లు ఏమి జరిగినా అక్కడ పెరుగు ఉండాల్సిందే. ఇక బిర్యానీ తీసుకున్నా రైతా ఉండాల్సిందే. గడ్డపెరుగుతో భోజనం చేసేవారు కూడా ఉంటారు. పెరుగు ఆరోగ్యానికి మంచిదే కానీ, మితంగా తీసుకుంటేనే మంచిది అంటున్నారు వైద్యులు.
పెరుగును మజ్జిగలా చేసుకుని తాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
అయితే వేసవిలో పెరుగు మజ్జిగ ఎక్కువగానే వాడతాం. అయితే రెయినీ సీజన్లో మాత్రం పెరుగు ఎక్కువగా తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు.పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియకు మేలు చేస్తాయి. దీనిలో కాల్షియం ఉండటం వల్ల ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
వర్షాకాలంలో పెరుగు తినడం ప్రమాదకరమని శ్వాస సంబంధ వ్యాధులు ఉన్న వారు కూడా ఈ సమయంలో పెరుగుకి దూరంగా ఉండాలి అని చెబుతున్నారు. అయితే గొంతులో సమస్యలు చాలా వరకూ వర్షాకాలం వేధిస్తాయి. ఈ సమయంలో కాచి చల్లార్చిన నీరు తాగాలి . అలాగే మజ్జిగ మేలు పెరుగుని వర్షాకాలం దూరం పెట్టండి అంటున్నారు.