బిగ్ బాస్ 5 ఆ డేట్ న ప్రారంభం కానుందా ?

Big Boss season 5 updates

0
37

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి ఎంత ఆద‌ర‌ణ ఉందో తెలిసిందే.భారీ టీఆర్ఫీతో ఈ షో విజయవంతంగా సాగుతోంది. బిగ్ బాస్ ఇప్పుడు 5వ సీజన్‌‌‌కు సిద్ధం అవుతోంది.
బిగ్ బాస్ సీజన్ 1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు.
సీజన్ 2 కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా మారాడు.

సీజన్ 3, సీజన్ 4లకు కింగ్ నాగార్జున హోస్ట్‌‌‌గా వ్యవహరించారు. ఇక సీజ‌న్ 5 కోసం ఎదురుచూస్తున్నారు అంద‌రూ. ఈ సారి సీజ‌న్లో పాల్గొనే కంటిస్టెంట్స్ వీళ్ళే అని కొన్ని పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక హోస్ట్ గా ఎవ‌రు రానున్నారు అనేదానిపై అనేక వార్త‌లు వినిపించాయి.

బిగ్ బాస్ సీజన్ 5కోసం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నార‌ట‌. సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్ సీజన్ 5 ప్ర‌సారం అయ్యే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది. ఇక సీజ‌న్ 5 కి హోస్ట్ ఎవ‌రు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. చూడాలి వచ్చే నెల‌లో అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుందట‌.