మన కుటుంబంలో ఎవరికి అయినా జ్వరం వచ్చింది అంటే ఎంతో బాధపడతాం. ఈ సమయంలో వారు తీసుకునే ఫుడ్ విషయంలో అనేక ఆంక్షలు పెడతాం.. ముఖ్యంగా ఇలాంటి వారు అధికంగా ఫుడ్ తీసుకున్నా ఇబ్బందే… ముఖ్యంగా జ్వరంతో ఉన్న వారు నాన్ వెజ్ తీసుకోవచ్చా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది.. అయితే ఇలా నాన్ వెజ్ తీసుకుంటే చాలా ఇబ్బంది… జ్వరంతో ఉన్న సమయంలో నాన్ వెజ్ వద్దు అంటున్నారు వైద్యులు.
మరి చికెన్ మటన్ ఫిష్ రొయ్యలతో పాటు నాన్ వెజ్ ఫుడ్ ఏదీ తీసుకోవద్దు.. అయితే కోడి గుడ్డు తీసుకోవచ్చా అంటే మీరు ఎలాంటి భయం లేకుండా కోడి గుడ్డు తీసుకోవచ్చు….కోడిగుడ్లలో ఉండే పోషకాలు ముఖ్యంగా ప్రోటీన్లు జ్వరం వచ్చిన వారికి ఎనర్జీ ఇస్తాయి… ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది.
అయితే మీరు ఆమ్లెట్ లా తీసుకోవద్దు.. కేవలం ఉడకబెట్టిన కోడి గుడ్డు మాత్రమే తీసుకోవాలి.. ఇక ఆకలి వేస్తేనే తినాలి అంతేకాని ఆకలి లేకపోయినా తీసుకోవద్దు… బాగా ఉడకబెట్టిన కోడి గుడ్డు మాత్రమే తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు.
ఇందులో సాల్మొనెల్లా ఉంటుంది ఉడకబెట్టకపోతే జ్వరం మరింత పెరుగుతుందట.