పాము కాటు వేసినపుడు ఏం చేయాలి? ఈ తప్పులు అస్సలు చేయకూడదు

-

ఎవరినైనా పాము కాటు వేసినపుడు వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లాలి.. పసరు నాటు వైద్యాల జోలికి వద్దు నేరుగా ఆస్పత్రికి తీసుకువెళ్లండి.. అయితే ముందు వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయంలో వారికి కొంచెం ప్రాధమిక చికిత్స
చేయండి.. ముందు వారిని ఆందోళన చెందద్దు అని చెప్పండి. బీపీ షుగర్ ఉంటే వీరు అసలు కంగారు పడకూడదు, ఇక ఆ కాటు వేసిన ప్రాంతం దగ్గర రఫ్ చేయడం ఐస్ పెట్టడం వేడి బొగ్గు క్లాత్ పెట్టడం ఇలాంటివి చేయకండి.ఇది డేంజర్ దీని వల్ల వాపు పెరుగుతుంది అవయవం దెబ్బ తింటుంది.. ఇక గాలి ఆడేలా ఆ వ్యక్తి ఉండాలి.

- Advertisement -

ఇక పాము కాటు వేస్తే చాలా మంది నోటితో ఆ విషం తీస్తాం అంటారు… ఇలా చేయద్దు చాలా డేంజర్… కత్తితో గాటు పెట్టి దానిని తీస్తారు… ఇలా కూడా డేంజర్ అధిక రక్తస్రావం జరుగుతుంది…పాము కాటు గాయానికి ఐస్, వేడి లేదా రసాయనాల వంటి పూతలు పూయటం కూడా డేంజర్ అస్సలు చేయవద్దు.

పాము కరిచిన చోట కట్టుకట్టటం వంటివి చేయకూడదు. వాపు మరింత పెరుగుతుంది ఆ ప్రాంతంలో, ఇక ఆ ఏరియా తొలిగించాల్సి ఉంటుంది.. అందుకే ఇలా చేయకూడదు. ఇక ఆకులు పసరు ఇలాంటివి కంటే ముందు వైద్యులు ఇచ్చే ఇంజెక్షన్ తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...