కరోనా థర్డ్ వేవ్ అక్టోబర్ లో ఉండచ్చు ? నిపుణులు ఏమంటున్నారంటే

Can the Corona Third Wave be in October?

0
135

కరోనా రెండోదశలో ఎంతలా విజృంభించిందో తెలిసిందే .వేలాది కేసులు నమోదు అయ్యాయి. ఇక చాలా స్టేట్స్ లో రోజుకి 20 వేల నుంచి 40 వేలకు కూడా కేసులు నమోదు అయ్యాయి. ఆక్సిజన్ కొరత ఏర్పడింది, అయితే ఇప్పుడు కాస్త పరిస్దితి మెరుగుపడింది .ఈ వైరస్ నుంచి కాస్త ఉపశమనం వస్తోంది కేసులు తగ్గుతున్నాయి.

అయితే ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసులు తగ్గాయి కదా అని మళ్లీ అన్నీ ఓపెన్ చేసి భారీగా గేదరింగ్ లు, మాస్క్ లు పెట్టకుండా తిరిగితే కచ్చితంగా ఇబ్బందులు తప్పవు అని అంటున్నారు.

తాజాగా ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఓ సర్వే నిర్వహించింది. వైద్యులు, ఆరోగ్యసంరక్షణా నిపుణులు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ఎపిడెమాలజిస్టులు, ప్రొఫెసర్లు ఈ సర్వేలో మొత్తం 40 మంది తమ అభిప్రాయాలు తెలిపారు.భారత్ లో అక్టోబరు నాటికి కరోనా థర్డ్ వేవ్ రానున్నట్లు 21 మంది నిపుణులు హెచ్చరించారు. అయితే కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలిపారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేస్తే దీని ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్నారు.