మహిళకు ఒకేసారి కొవాగ్జిన్ – కొవిషీల్డ్ టీకా వేశారు చివరకు ఏమైందంటే

The woman was vaccinated at one time with covavin - covishield

0
51

దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు వేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే పెద్ద వయసు వారికి అందరికి కూడా టీకా వేస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే ఈ సమయంలో ఓ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ సిబ్బంది ప్రజల కంగారు పడ్డారు. ఆరోగ్య కార్యకర్తలు ఓ మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు టీకాలూ ఇచ్చేశారు.

దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
బిహార్లో జరిగింది ఘటన. పాట్నా శివారులోని పున్పున్ పట్టణంలోని ఓ పాఠశాలలో వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేశారు. 65 ఏళ్ల సునీలాదేవి అనే మహిళ వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చింది. అక్కడ 18 ఏళ్లు పైబడిన వారు 45ఏళ్లు పైబడిన వారు ఇలా రెండు వరుసలో ఉన్నారు.

మొదటి వరుసలోకి వెళ్లి కొవిషీల్డ్ టీకా వేయించుకున్న ఆమె, తర్వాత మరో లైన్ లో నిల్చుని కొవాగ్జిన్ టీకా వేయించుకుంది. దీంతో ఆమెని అబ్జర్వేషన్ లో ఉంచారు. అయితే ఆమెకి కాస్త జర్వం వచ్చిందని తర్వాత బాగానే ఉందని తెలిపారు వైద్యులు.ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమెకి ఈ ప్రక్రియ గురించి తెలియకపోవడంతో ఇలా జరిగింది అంటున్నారు వైద్యులు.