అర్ధరాత్రి దాటినా నిద్రరావట్లేదా? అయితే ఇలా చేయండి..

0
46
Dreams in blue

మనలో చాలామంది అర్ధరాత్రి దాటినా నిద్రరాకపోవడం వల్ల రాత్రిదాకా ఫోన్, టీవీలు చూస్తూ కాలం గడిపేస్తుంటారు. కానీ నిద్రపోకపోవడం వల్ల అనేక ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కేవలం యువత, మధ్యవయస్కుల్లో ఉండే సమస్య మాత్రమే కాదు. వృద్ధుల్లోనూ ఈ సమస్యతో బాధ పడే వారు చాలా మంది ఉన్నారు.

మధ్యాహ్నం నిద్ర పోతే రాత్రిపూట సరిగా నిద్ర రాదు. కావున మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉన్నవారు వీలయినంత తొందరగా మానుకోవడం మంచిది. వీలైతే రోజూ కాసేపు నడవటం మంచిది. దీంతో శరీరం, మనసు హుషారుగా ఉంటాయి. సాయంత్రం పూట మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కాసేపు ముచ్చటించండి. దీనివల్ల మనసుకు ఉల్లాసం కలిగి నిద్రపడుతుంది.

సాయంత్రం గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం, పడకగదిలో వెలుగు మరీ ఎక్కువగా లేకుండా చూసుకోవటం, శ్రావ్యమైన సంగీతం వినటం, కాసేపు పుస్తకం చదువుకోవటం, పడుకునే ముందు గ్లాసు పాలు తాగటం వంటివి ఆచరిస్తే నిద్ర బాగా పట్టటానికి అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.