మద్యం తాగడం మానేయలేకపోతున్నారా? అయితే ఒక్కసారి ఈ టిప్స్ పాటించండి..

0
113

మద్యం తాగడం వల్ల ఎన్నో దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానివల్ల తమ కుటుంబాన్ని తామే చిక్కులోకి నెట్టేసిన వారవుతారు. రాష్టంలో చాలా గొడవలు కావడానికి గల కారణం మద్యం సేవించడమే. రాష్టంలో మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మద్యం మానేయడానికి ఎన్ని చిట్కాలు ప్రయత్నించినా ఫలితం లభించని వాళ్ళు ఒక్కసారి ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి.

రోజు క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల మద్యం సేవించే అలవాటు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. క్యారెట్ జ్యూస్ ఆల్కహాల్ తాగాలనే కోరికను మెదడు నుండి తీసేస్తుంది. అంతేకాకుండా మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆల్కహాల్‌ను పూర్తిగా దూరం చేసుకోవాలంటే ఖర్జూరాన్ని మెత్తగా చేసుకుని, దానిని పాలల్లో కలిపి తాగండి. దానివల్ల మంచి ప్రయోజనం తప్పకుండా కలుగుతుంది.

ద్రాక్ష నుంచి వైన్ తయారు చేస్తారు. అందుకే రోజూ ద్రాక్ష పండ్లను తింటే, మద్యపానం అలవాటును త్వరగా వదులించుకోవచ్చు. ఆల్కహాల్ అలవాటు మానేయాలనుకునేవారికి క్యాప్సికమ్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. క్యాప్సికమ్‌‌ను మెత్తగా చేసుకుని, దాని రసాన్ని తీయాలి. రోజుకు అరకప్పు క్యాప్సికమ్ రసాన్ని తాగడం ద్వారా మద్యపానం సేవించే అలవాటు నుండి త్వరగా కోలుకోవచ్చు.