గోర్లు కొరికే అలవాటు మానలేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

0
101

సాధారణంగా చాలామందికి గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. ఏ మాత్రం కంగారుగా, భయంగా అనిపించినా వెంటనే గోళ్ళు కొరకడం మొదలు పెట్టేస్తారు. ఇలా గోళ్ళుకొరకడం వల్ల ఒత్తిడి, టెన్షన్ వంటివి తగ్గుతాయని అంటుంటారు. ఒక్కోసారి ఆకలిగా అనిపించినా కూడా గోళ్ళు కొరుకుతూ ఉంటారట.

ఈ అలవాటు ఎలా మనుకోవాలంటే?

గోళ్ళకి చేదుగా ఉండే నెయిల్ పాలిష్ వేయడం వల్ల ఈ అలవాటు మానడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా గోళ్ళు బాగా పొట్టిగా కత్తిరించుకోవడం వల్ల కూడా మనుకోవచ్చు. గోళ్ళకి ఏదైనా చేదుగా ఉండే నూనెని అప్లై చేసుకుంటూ ఉండడంమంచిది.

అలాగే, రాత్రి పూట గ్లోవ్స్ వేసుకుని పడుకోవడం, గోళ్ళ బదులు సోంపు నమలడం వంటివి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. గోర్లు కొరగాకుండా ఉండాలంటే చేతి రుమాలును వేళ్ళకి చుట్టండి. దీనివల్ల పనిమీదకి ద్యాస మళ్ళుతుంది.