కోటి జైకొవ్​-డి టీకాల కోసం కేంద్రం ఆర్డర్​ ​

Center Order for Coty Zykov-D Vaccines

0
40

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా త్వరలో కొవిడ్‌ టీకాల పంపిణీ ప్రారంభం కానున్నది. 12 సంవత్సరాలు పైబడిన వారికి టీకాలు వేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా నుంచి కోటి డోసుల జైకోవ్‌-డీ వ్యాక్సిన్‌ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెలలో జాతీయ కొవిడ్‌ టీకాల క్యాంపెయిన్‌లో చేర్చనున్నారు. టీకాలు ప్రాధాన్యతా క్రమంలో ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.

జైకోవ్‌-డీ కోటి డోసుల కోసం కేంద్రం ఆర్డర్‌ ఇచ్చింది. ఒక్కో వ్యాక్సిన్‌కు జైడస్‌ క్యాడిలా పన్నులు మినహాయించగా..టీకా ధరను రూ.358 నిర్ణయించినట్లు సమాచారం. ఇందులోనే రూ.93 విలువైన టీకాను వేసే ‘జెట్‌ అప్లికేటర్‌’ను కూడా సరఫరా చేయనుంది. వ్యాక్సిన్‌ సూది రహితం కావడంతో.. ఈ జెట్‌ అప్లికేటర్‌ సహాయంతోనే టీకాను వేయనున్నారు. కంపెనీ నెలకు కోటి డోసుల జైకోవ్‌-డీ టీకాలను అందించే స్థితిలో ఉందని కంపెనీ అధికారులు మంత్రిత్వశాఖకు తెలిపారు.

ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ ఆధారిత, మూడు డోసుల వ్యాక్సిన్‌. తొలి డోస్‌ తర్వాత 28 రోజులకు రెండో డోస్‌, 56 రోజులకు మూడో డోసు వేయనున్నారు. జైకోవ్‌-డీ వాక్సిన్‌కు ఆగస్ట్‌ 20న డ్రగ్‌ క్రంటోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదించిన విషయం తెలిసిందే.