రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..అవసరమైతే నైట్‌ కర్ఫ్యూ..!

Central alert for states .. Night curfew if necessary ..!

0
74

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ పై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్న తరుణంలో రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఒమైక్రాన్ వేరియంట్ విస్తరిస్తుండటం, కోవిడ్ పాజిటివిటీ రేటు గత రెండు వారాలుగా పెరుగుతుండంతో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కోవిడ్ విస్తరిస్తున్న జిల్లాల్లో నైట్ కర్ఫ్యూలు సహా మరిన్ని ఆంక్షలు విధించే విషయమై దృష్టి సారించాలని ఆదేశించింది.

10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున తక్షణ చర్యలపై దృష్టి పెట్టాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ఏదైనా జిల్లాలోనైనా పాజిటిటి రేటు పదిశాతం కంటే ఎక్కువగా నమోదైనట్లైతే అక్కడ కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆయన సూచించారు. అలాగే వ్యాక్సిన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఆయన లేఖలో సూచించారు.