చన్నీటి స్నానం మంచిదా వేడినీటి స్నానం మంచిదా ?

చన్నీటి స్నానం మంచిదా వేడినీటి స్నానం మంచిదా ?

0
152

చాలా మంది ఉదయం వేడి నీటి స్నానం చేయడానికి అంత ఇంట్రస్ట్ చూపించరు, కొందరు అయితే చన్నీటి స్నానం మాత్రమే చేస్తారు.. అయితే తమకు వేడి నీరు చేయకపోతే జలుబు చేస్తుంది అని కొందరు అంటే, మరికొందరు తనకు వేడి నీటి స్నానం చేస్తే తలనొప్పి వస్తుంది అంటారు, అయితే వేడినీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి కొంతమేర వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఇలా వేడి నీరు స్నానం చేస్తే మీకు వేడి పుట్టి శరీరంలో వ్యాయామ ప్రక్రియ జరుగుతుంది..నిత్యం వేడి స్నానం చేసే వారిలో గుండెపోటు, ఇతరాత్ర గుండె సమస్యల ముప్పు చాలా తక్కువ ఉంటుంది. బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది,
ఇక గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అని వైద్యులు చెబుతున్నారు.

వేడినీటి స్నానం చేసినవారిలో క్యాలరీలు కొద్ది మొత్తంలో కరుగుతాయి అంటున్నారు వైద్యులు, అయితే అందరికి వేడీ నీటి స్నానం పడకపోవచ్చు సో వారు చల్లనీటి స్నానం చేస్తే మేలు, ఏదైనా వైద్యులని సంప్రదించి చేయండి.