ఈఏడాది రెండోసారి జూన్ 5 న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా,భారత్ లో ఏర్పడనుంది..సూర్యునికి, చంద్రునికి మధ్యలో భూమి వచ్చినపుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుందనే సంగతి తెలిసిందే.
చంద్రగ్రహణం రాత్రి 11:15 గంటలకు మొదలవుతుంది. జూన్ ఆరు తెల్లవారుజామున 2:34 ముగుస్తుంది.
ఈ సమయంలో గర్భిణీలు బయటకు రాకుండా ఉంటే మంచిది.. గ్రహణ ప్రభావం లేకుండా చూసుకోవాలి, అంతేకాదు గ్రహణం సమయంలో వీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు అని చెబుతున్నారు పండితులు..
ఇక కదలికలు చేయడంవల్ల ఎలాంటి అపాయం ఉండదు అంటున్నారు, ఇక నేరుగా బయట గ్రహణం చూస్తే ఆ కిరణాల వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు.. కడుపులోని శిశువుపై ఆ చంద్రుని కిరణాలు పడకూడదనేది విశ్వాసం ఉంది. ఒకవేళ పడితే ఆ శిశువు పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు… అందుకే గర్భిణీలు గ్రహణానికి ముందు పడుకుంటే మంచిది అని ఎలాంటి సమస్య రాదు అంటున్నారు పండితులు.