ఈ మధ్యకాలంలో మనలో చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నొప్పులు రావడానికి ప్రధాన కారణం శరీరంలో కాల్షియం తక్కువగా ఉండడమే అని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సమస్య నుండి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసిని తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తులసి రసాన్ని కలుపుకుని తాగితే మోకాళ్ల నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
ఇంకా ప్రతిరోజూ పసుపు పాలు తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. పసుపులో యాంటీ సెప్టిక్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల వాపు, నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. పసుపు గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడతాయి.