కరోనా టీకా – Co-WIN కొవిన్ యాప్ పై – మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

0
101

దేశంలో కరోనా టీకా కి Co-WIN  కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే, ఇందులో రిజిస్టర్ అయిన వారికి టీకా అందిస్తున్నారు…కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది కొవిన్ పోర్టల్.. ఇప్పుడు హిందీతో సహా 10 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి వచ్చింది.

 

తాజాగా ఇందులో తెలుగు, మరాఠీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, ఒడియా భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా మార్పులు చేసింది కేంద్రం, దీంతో ప్రాంతీయ భాషల్లో కూడా దీనిని పూర్తిగా తెలుసుకోవచ్చు, ఇంకా సులువుగా రిజిస్ర్టేషన్ ప్రాసెస్ ఉంటుంది.

 

దేశంలో 18ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా పొందాలంటే కొవిన్ పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రర్ అవ్వాలి..

ఇటీవల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో భాష కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయి. అంతేకాదు సిబ్బందికి కూడా ఒత్తిడి పెరుగుతోంది దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.. దేశంలో ఇప్పటివరకు 22కోట్ల మందికిపైగా టీకాలు వేశారు.