బాలయ్య పుట్టిన రోజున అభిమానులకి ఆ దర్శకుడు గుడ్ న్యూస్ చెబుతారా?

balakrishna birth day balakrishna new movies

0
38

దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్నారు, ఇక ఇప్పటికే ఎఫ్ 3 సినిమా సెట్స్ పై పెట్టారు, దాదాపు 60 శాతం మేర షూటింగ్ పూర్తి అయింది, ఈ కరోనా వేవ్ వల్ల విరామం ఇచ్చారు, మరో నెల రోజుల్లో అన్నీ సెట్ అయితే ఈ సినిమా షూటింగ్ మళ్లీ పట్టాలెక్కుతుంది, అయితే తర్వాత అనిల్ ఏ సినిమా చేస్తారు అనేదాని గురించి టాక్స్ నడుస్తున్నాయి.

 

అయితే బాలయ్య బాబుతో ఆయన సినిమా ఉంటుంది అని తెలుస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ వల్ల  ఈ నెల రోజుల్లో సినిమాపై పూర్తి వర్క్ చేశారట, ఇక స్టోరీ మరోసారి బాలయ్యకు వినిపించడానికి సిద్దం అవుతున్నారట.

ఈ నెల 10వ తేదీన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఉండవచ్చని టాక్, ఆరోజు బాలయ్య పుట్టిన రోజు సో అభిమానులు కూడా కొత్త ప్రాజెక్ట్ గురించి ఎదురుచూస్తారు..

 

అందుకే ఈ రోజు ట్రీట్ కు సిద్దం అవుతున్నారట.  ఇక అఖండ సినిమా షూటింగు పూర్తికాగానే బాలకృష్ణ, గోపీచంద్ మలినేనితో ఓ చిత్రం చేస్తారు ఇది పూర్తి అయిన తర్వాత అనిల్ రావిపూడితో నెక్ట్స్ చిత్రం చేస్తారట.