ఏపీలో కరోనా విజృంభణ..బులెటిన్ రిలీజ్..ఆ జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు

Corona boom in AP..Bulletin release..More than a thousand cases in those districts

0
103

కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. గతంలో కరోనా కట్టడికి చేపట్టిన లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల కారణంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త వేరియంట్‌తో పాటు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.

ఇక తాజాగా ఏపీలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 35,673 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 4,955 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అంటే ఇన్నటి కంటే 400లకుపైగా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కోవిడ్‌ నుంచి కొత్తగా 397 మంది కోలుకున్నారు. కరోనాతో కొత్తగా పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  212

చిత్తూరు         1039

ఈస్ట్ గోదావరి   303

గుంటూరు 326

వైస్సార్ కడప 377

కృష్ణ   203

కర్నూల్  323

నెల్లూరు   397

ప్రకాశం    190

శ్రీకాకుళం 243

విశాఖపట్నం  1103

విజయవాడ   184

వెస్ట్ గోదావరి   55