భారత్ లో కరోనా విజృంభణ..ఒక్కరోజే ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?

Corona boom in India..how many cases were registered in a single day?

0
190

ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. మరోవైపు ఒమిక్రాన్ చాపకింది నీరులా వ్యాపిస్తుంది. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,72,433 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,18,03,318 కు చేరింది.

ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 15,33,921 కు చేరింది. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,008 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,59,107 మంది కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 3,96 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 167.87 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇండియాలో రోజు వారీ కేసుల శాతం 10.99 శాతంగా నమోదు కాగా నిన్నటి కంటే.. 6.8 శాతం కరోనా కేసులు ఎక్కువగా పెరిగిపోయాయి.

మొత్తం మరణాలు: 4,98,983

యాక్టివ్ కేసులు: 15,33,921