దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. అయితే రోజుకి నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు అయిన పరిస్దితి నుంచి ఇప్పుడు మళ్లీ లక్ష లోపు కేసులు నమోదు అవుతున్నాయి. నేడు కూడా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి.
దేశంలో నిన్న 67,208 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
1,03,570 మంది కోలుకున్నారు. పాజిటివిటి రేటు కంటే రికవరీ రేటు బాగుంది అని తెలియచేస్తున్నారు అధికారులు. దేశంలో నిన్న 2,330 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
అయితే కరోనా ముప్పు తగ్గిపోయిందని కేసులు తగ్గుతున్నాయి కాబట్టి సడలింపులు వస్తున్నాయి కాబట్టి మళ్లీ మాస్కులు లేకుండా సామాజిక దూరం పాటించకుండా తిరిగితే ముప్పు తప్పవు అని హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలను కచ్చితంగా బయటకు తీసుకురావద్దు అని తెలియచేస్తున్నారు నిపుణులు.