కరోనా కలవరం..హెల్త్ బులెటిన్ రిలీజ్..కొత్త కేసులు ఎన్నంటే?

0
46

ఇండియాలో కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక కరోనా పీడ విరగడ అయింది అనుకున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.

రోజురోజుకు దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 7946 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల విషయానికొస్తే 62,748 కు చేరింది. ఇక దేశంలో తాజాగా 37 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 5,27,911 కి చేరింది. ఇక దేశ వ్యా ప్తంగా రికవరీల  సంఖ్య 4,38,45,680 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2. 12 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.