కరోనా డేంజర్ బెల్స్..సర్కార్ కీలక నిర్ణయం

0
35
RT-PCR mandatory

తెలంగాణాలో కరోనా తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. అంతేకాదు కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి మాస్క్ ను తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. లేదంటే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు 500కు చేరువలో ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో.. భాగ్యనగర పరిసర ప్రాంతాల్లో కొవిడ్ వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైన దృష్ట్యా విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది. దీనితో ఫోర్త్ వేవ్ రానుందనే భయం అందరిలోనూ నెలకొంది. తెలంగాణలోనూ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.