ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,440 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,80, 634కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.
అలాగే ఒక్కరోజు వ్యవధిలో మరో నలుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 542కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 83,610 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 3969మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,21,47,031 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా విశాఖ జిల్లాలో ప్రమాదకరంగా 1959 కొత్త కేసులు వెలుగుచూశాయి. చిత్తూరులో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
అనంతపురం 1534
చిత్తూరు 1198
ఈస్ట్ గోదావరి 1012
గుంటూరు 1458
వైస్సార్ కడప 788
కృష్ణ 304
కర్నూల్ 1238
నెల్లూరు 1103
ప్రకాశం 1399
శ్రీకాకుళం 921
విశాఖపట్నం 2258
విజయవాడ 614
వెస్ట్ గోదావరి 613