దేశంలో కరోనా తగ్గుముఖం..తాజా కేసులు ఎన్నంటే?

0
39

భారత్​లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు మూడు లక్షలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కానీ ఇప్పడు రోజుకు రెండు లక్షల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,09,918 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

ఒక్కరోజులో మరో 2,09,918 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి కారణంగా ఆదివారం మరో 959 మంది మరణించారు. 2,62,628 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,62,628 మంది కరోనా నుంచి కోలు కున్నారు.

ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,89,76,122 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,66,03,96,227 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం 28,90,986 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 166,03,96,227కు చేరింది.

 

మొత్తం కేసులు: 4,13,02,440

మొత్తం మరణాలు: 4,95,050

యాక్టివ్ కేసులు: 18,31,268

మొత్తం కోలుకున్నవారు: 3,89,76,122