చైనాలో కరోనా కలవరం..ఇక అవన్నీ బంద్!

Corona disturbance in China..and everything is closed!

0
91

చైనాలో కరోనా వ్యాప్తి మళ్లీ కలవరం సృష్టిస్తోంది. పర్యటకుల కారణంగా ఆ దేశంలో వైరస్​ బాధితులుగా మారే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు అక్కడి అధికారులు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోని వందలాది విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. పాఠశాలలను మూసివేశారు. పెద్దఎత్తున పరీక్షలు చేపడతున్నారు.

చైనాలో కొవిడ్​ కేసులు మళ్లీ పెరగడానికి పర్యటకులైన ఓ వృద్ధ దంపతులే కారణమని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. షాంఘై నుంచి బయలుదేరిన ఆ దంపతులు..గన్సు ప్రావిన్సు, ఇన్నర్ మంగోలియా, జియాన్​ నగరాల్లో పర్యటించారని భావిస్తున్నారు. వారితో సన్నిహితంగా ఉన్న కారణంగా చైనా రాజధాని బీజింగ్ సహా ఐదు ప్రావిన్సులు, ఇతర ప్రాంతాల్లో వైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో స్థానిక ప్రభుత్వాలు. వైరస్ కట్టడికి నడుం బిగించాయి.

లాంజోవ్​ నగరంలో ప్రజలను అనవసరంగా బయటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా బయటకు వెళ్లేవారు కచ్చితంగా కరోనా నెగెటివ్​గా తేలిన ధ్రువపత్రాలను సమర్పించాలని చెప్పారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోని విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు.