కరోనా ఎఫెక్ట్ – సిగరెట్ కాలుస్తున్నారా ఇది తెలుసుకోండి

Corona Effect - Find out if you are smoking a cigarette

0
37

 

ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా గురించే మాట్లాడుకుంటున్నారు.కొన్ని లక్షల కుటుంబాల్లో చిచ్చు పెట్టింది కరోనా . ఇది మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత ఆందోళన రేపింది. ఎందరినో దూరం చేసింది. అయితే కొన్ని అలవాట్లు ఉండటం వల్ల కరోనా సోకితే వారికి మరింత తీవ్రత పెరుగుతోంది అంటున్నారు వైద్యులు.

ముఖ్యంగా సిగరెట్ స్మోకింగ్ ఇది ఎక్కువగా చేసేవారు కరోనా సోకితే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అని వైద్యులు చెబుతున్నారు…సిగరెట్ తాగేవారు, పొగాకు బాధితులు ఎక్కువగానే ఉంటున్నారు. పొగాకు విండ్ పైప్లో, ఊపిరితిత్తులలో వైరస్కి సంబంధించిన ACE2 గ్రాహకాల సంఖ్యను పెంచుతుంది. దీని వల్ల వైరస్ మరింత అధికం అవుతుంది.

కరోనా వైరస్ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ధూమపానం ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది. అందుకే ఈ స్మోకింగ్ కు దూరంగా ఉండాలి అని చెబుతున్నారు వైద్యులు. ఇక ఎందుకు వీరికి ఎక్కువ కరోనా సోకే అవకాశం ఉంది అంటే, సిగరెట్ కాల్చేవారు చేతిని పెదాలపై పెడుతూ ఉంటారు చేతికి వైరస్ ఉంటే ఈజీగా బాడీలోకి చేరుతుంది అని చెబుతున్నారు వైద్యులు.గుట్కా – పొగాకు శరీరం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది సో దీనికి దూరంగా ఉండాలి.