మళ్ళీ విరుచుకు పడుతున్న కరోనా మహమ్మారి..తాజా కేసులు ఎన్నంటే?

0
100
RT-PCR mandatory

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే మన దేశంలో కూడా కరోనా కొత్త కేసులు గత రెండు రోజులుగా భారీగా పెరగడం ప్రజలు కాస్త ఆందోళన పడే విషయంగానే చెప్పుకోవచ్చు.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 4270 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,26,30,852గా ఉంది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 25,782కు చేరింది. దేశంలో తాజాగా 15 మంది కరోనాతో మరణించడం జరిగింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా1,94,12,87,000 కోట్ల  మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కరోనా కేసులు: 4,26,30,852

మొత్తం మరణాలు: 5,24,701

యాక్టివ్​ కేసులు: 25,782