ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 49,143 సాంపిల్స్ పరీక్షించగా..13,618 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,19,678కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.
అలాగే ఒక్కరోజు వ్యవధిలో మరో తొమ్మిది మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,06,318 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 8,687మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి దాకా 3,22,83,369 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
అనంతపురం 1650
చిత్తూరు 493
ఈస్ట్ గోదావరి 961
గుంటూరు 1464
వైస్సార్ కడప 907
కృష్ణ 803
కర్నూల్ 1409
నెల్లూరు 1007
ప్రకాశం 1295
శ్రీకాకుళం 644
విశాఖపట్నం 1791
విజయనగరం 466
వెస్ట్ గోదావరి 728