‘జూ’లో సింహాలకు కరోనా..ఎక్కడో తెలుసా?

Corona for lions at the zoo..do you know somewhere?

0
36

కరోనా..వన్య ప్రాణులనూ విడిచిపెట్టడం లేదు. ఉత్తర అమెరికాలోని 40% జింకల్లో కొవిడ్‌ యాంటీబాడీలు పుష్కలంగా ఉన్నట్టు తాజా పరిశోధనలో తేలింది. బాంగోర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గ్రయీమ్‌ షానన్‌, అమీ గ్రేషమ్‌, ఒవైన్‌ బార్టన్‌లు ఈ విషయాలను పంచుకున్నారు.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మనిషికి ఈ వైరస్‌ ఎలా సోకింది? మనిషి నుంచి ఇది ఏయే జీవులకు సోకే ముప్పుంది? అన్న అంశాలపై పెద్ద చర్చలే నడిచాయి. ఇళ్లు, జనావాసాల్లో తిరిగే కుక్కలు, పిల్లులు, జంతు ప్రదర్శనశాలల్లోని మూగజీవులకు కరోనా వ్యాపించవచ్చని పరిశోధకులు భావిస్తూ వచ్చారు. కానీ, వన్యప్రాణులు కూడా భారీగానే మహమ్మారికి గురైనట్టు తాజా పరిశోధన తేల్చింది.

సింగపూర్​కు చెందిన ఓ జూలో నాలుగు సింహాలకు కరోనా సోకింది. అవును నిజమే..జూలో సిబ్బందికి కరోనా సోకిన నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా సింహాలకు కూడా పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే అవి ఆహారం బాగానే తింటూ చురుకుగానే ఉన్నాయని వెల్లడించారు. వాటితో పాటు ఉన్న మరో ఐదు సింహాలతో సహా మొత్తం తొమ్మిది సింహాలను ఐసోలేషన్​లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.