కరోనా నుంచి కోలుకున్నారా..? మ‌ళ్లీ అనారోగ్య‌మా ? అయితే ఈ టెస్టు గురించి తెలుసుకోండి

కరోనా నుంచి కోలుకున్నారా..? మ‌ళ్లీ అనారోగ్య‌మా ? అయితే ఈ టెస్టు గురించి తెలుసుకోండి

0
84

చాలా మంది క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత కోలుకుని క్షేమంగా ఇంటికి వెలుతున్నారు, ఇది చాలా మంచి విష‌యం అనే చెప్పాలి, అయితే చాలా మందికి కోలుకున్న త‌ర్వాత ప‌లు ఇబ్బందులు వ‌స్తున్నాయి అని మ‌ళ్లీ వైద్యుల ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నారు.

ఆయాసం, కండరాల నొప్పి లాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా కోలుకున్న తర్వాత కొందరిలో రక్తం గడ్డ కట్టడాన్ని డాక్టర్లు గుర్తించారు. అయితే వైర‌స్ బాదితులు కోలుకున్న త‌ర్వాత మీరు డి-డైమర్ అనే టెస్ట్ చేయించుకుంటే మేలు అంటున్నారు. దీని వల్ల పేషెంట్ పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడ్డాడా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు.

రక్తం గడ్డకట్టినట్లు గుర్తిస్తే.. ఈ సమస్యను తగ్గించడానికి రక్తాన్ని పలుచన చేసే ఔషధాలను ఇస్తున్నారు. పేషెంట్‌కు ఎంత మోతాదులో బ్లడ్ థిన్నర్ అవసరమో తెలుసుకోవడం కోసం డి-డైమర్ టెస్టు ఉపయోగ‌ప‌డుతుంది. ఆయన తెలిపారు. ఇది చాలా స్టేట్స్ లో హ‌స్ప‌ట‌ల్స్ చేస్తున్నాయ‌ని అంటున్నారు వైద్యులు, ఇలా కోలుకున్న త‌ర్వాత ఇబ్బందులు వ‌స్తే వెంట‌నే వైద్యుల‌ని సంప్ర‌దించండి అని చెబుతున్నారు… డి-డైమర్ టెస్టు ద్వారా శరీరంలో రక్తం ఎక్కడైనా గడ్డ కట్టిందేమో తెలుసుకోవచ్చు.